- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరో నాగార్జున పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఉత్తర్వులు
టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున (Nagarjuna) ఇటీవల ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరైన నాగార్జున (Nagarjuna) ఇటీవల ఢిల్లీ హైకోర్టు (Delhi High Court)ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కొంత మంది తన ఫొటో, పేరును వాడుకుంటున్నారని.. తన అనుమతి లేకుండా తన పేరు గాని, ఫొటోలు గాని వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని నాగార్జున కోర్టులో పిటిషన్ వేశారు. సినీ నటుల అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దని గతంలో ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే హీరో నాగార్జున పిటిషన్ పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.. ఈ రోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హీరో అక్కినేని నాగార్జున అనుమతి లేకుండా వారి పేరును వాడుకోవద్దని ఆదేశించింది. అలాగే నాగార్జున వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా నాగార్జున పేరుతో అనేక వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ప్రచారం అవుతున్నాయి. అలాగే, అతని లైక్నెస్‌తో ఏఐ ఆధారంగా వీడియోలు, కంటెంట్ రూపొందించడం, అనధికారిక వాణిజ్య ప్రకటనల్లో ఉపయోగించడం జరుగుతుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇటీవలి సందర్భాలలో బాలీవుడ్ నటులు ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు కూడా ఢిల్లీ కోర్టు ఇలాంటి తీర్పే ఇచ్చింది






