ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'దేఖ్‌లేంగ్ సాలా' సాంగ్‌ విడుదల

by Malleboina Mahesh |

ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ సీనియర్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో మాస్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్‌లేంగ్ సాలా సాంగ్‌ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం, టాలీవుడ్ సీనియర్ హీరో అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan), దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో మాస్ ఎంటర్‌టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. గతంలో వీరి కాంబోలో వచ్చిన సినిమా భారీ విజయం సాధించగా.. ఉస్తాద్ భగత్ సింగ్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. కాగా ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagat Singh') నుంచి శనివారం సాయంత్రం 'దేఖ్‌లేంగ్ సాలా.. చూసినాంలే చాలా' (Dekhlenge Saala) అనే మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. కాగా ఈ పాట యూట్యూబ్‌లో అప్పుడే రికార్డులు సృష్టిస్తోంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ స్టెప్పులు, ఎనర్జీ చూసి అభిమానులు ఉర్రూతలూగుతున్నారు. పవన్‌ను ఈ రేంజ్‌లో మాస్ డ్యాన్స్‌లో చాలా రోజుల తర్వాత చూస్తున్నామని, ఇది కచ్చితంగా ఆయన కెరీర్‌లో మరో డ్యాన్స్ ట్రీట్ కాబోతుందని దర్శకుడు హరీశ్ శంకర్ ముందు నుంచి చెబుతూ వచ్చిన మాటలను ఈ పాట నిజం చేసిందని సినీ వర్గాలు అంటున్నాయి. పాటలో పవన్ స్వాగ్, స్టైల్‌కు తోడు అదిరిపోయే మాస్ మూమెంట్స్ ఫ్యాన్స్‌కు పండుగ వాతావరణాన్ని తెచ్చాయి.

వింటేజ్ డీఎస్పీ రికార్డింగ్.. అభిమానుల్లో కొత్త జోష్!

ఈ పాట పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాక, మ్యూజిక్ లవర్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ఈ పాటను స్వరపరిచిన దేవి శ్రీ ప్రసాద్ (DSP)పై ప్రత్యేకంగా ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా కాలం తర్వాత 'వింటేజ్ డీఎస్పీ' మ్యూజిక్‌ను ఈ పాటలో వింటున్నామని, పవన్ కళ్యాణ్, డీఎస్పీల కాంబినేషన్ మ్యాజిక్‌ను మరోసారి తెరపై చూడబోతున్నామని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 'గబ్బర్ సింగ్' కాంబో మళ్లీ రిపీట్ అవుతున్న నేపథ్యంలో, ఈ పాట ఇచ్చిన జోష్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పవన్ డ్యాన్స్, డీఎస్పీ సంగీతం, హరీశ్ శంకర్ టేకింగ్ ఈ సినిమాను బ్లాక్‌బస్టర్‌గా నిలపడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పాట కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Next Story