Amaran: బ్లాక్ బస్టర్ ‘అమరన్’ చిత్రబృందాన్ని అభినందించిన డిఫెన్స్ మినిస్టర్..!

by Kodari Anjali |

మేజర్ ముకుంద్ వరదరాజన్(Major Mukund Varadarajan) నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’(Amaran).

Amaran: బ్లాక్ బస్టర్ ‘అమరన్’ చిత్రబృందాన్ని అభినందించిన డిఫెన్స్ మినిస్టర్..!
X

దిశ, వెబ్‌డెస్క్: మేజర్ ముకుంద్ వరదరాజన్(Major Mukund Varadarajan) నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘అమరన్’(Amaran). ఈ సినిమాలో కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్(Sivakarthikeyan) అండ్ టాలీవుడ్ నేచురల్ బ్యూటీ సాయిపల్లవి(Sai Pallavi) హీరో, హీరోయిన్‌గా నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందారు. దీపావళి(Diwali) కానుకగా అక్టోబరు 31 వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన అమరన్ మూవీ చూసి జనాలు కంటతడి పెట్టారు. ఇకపోతే రీసెంట్‌గా అమరన్ చిత్రాన్ని వీక్షించినా.. డిఫెన్స్ మినిస్టర్(Defense Minister) ఈ చిత్రబృందాన్ని అభినందిచారు. డైరెక్టర్ రాజ్ కుమార్(Director Raj Kumar), నిర్మాతలు, నటుడు శివ కార్తికేయన్, ప్రొడ్యూసర్ మహేంద్రన్‌(Producer Mahendran)లను న్యూ ఢిల్లీ(New Delhi)లోని తన నివాసంలో మీట్ అయ్యారు. అనంతరం వారిపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా హీరో శివ కార్తికేయన్.. మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో భారత సైన్యం యొక్క దేశభక్తి, వీరత్వాన్ని చూపించడంపై ప్రత్యేకంగా అభినందించారు. మూవీ టీమ్ తో పాటు డివో మూవీస్ వ్యవస్థాపకుడు(Founder of Devo Movies), డైరెక్టర్ విశ్వనాథ్ రామస్వామి(Director Vishwanath Ramaswamy), కల్నల్ (రిటైర్డ్) వినోద్ శరవణన్(Colonel Vinod Saravanan) కూడా ఇందులో పాల్గొనడం విశేషం.

Next Story