- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న ‘దీవానా'.. ఆ తేదీన థియేటర్లలోకి ఎంట్రీ
ధీవానా చిత్రాన్ని జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘దీవానా’ విడుదలకు సిద్ధమైంది. తాజాగా చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “వన్ సైడ్ లవ్ శాస్తున్నా.. మస్తుంటది..” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా యూత్‌ను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.
తాజాగా విడుదలైన పోస్టర్‌లో హీరో, హీరోయిన్ ఎదురెదురుగా కూర్చొని ఒకరినొకరు చూసుకుంటున్నారు. ఈ పోస్టర్ ద్వారా ఈ చిత్రంలో ఈ ఇద్దరి మధ్య ప్రేమ, భావోద్వేగాలు ప్రధానంగా ఉండబోతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి శ్రీకాంత్ సంగిశెట్టి కథ, మాటలు అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘వి-స్టూడియోస్’ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. సంగీతాన్ని ఈశ్వర్ చంద్ర అందిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్‌తో ఆసక్తిని పెంచిన ‘దీవానా’ విడుదల తర్వాత ప్రేక్షకులను ఎంత మేర ఆకట్టుకుంటుందో చూడాలి.






