‘దీవాన’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్...

by Chukka Sudharani |

శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’.

‘దీవాన’ మ్యూజికల్ జర్నీ స్టార్ట్...
X

దిశ, సినిమా: ‘శుభం’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘దీవాన’. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పుడు తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ‘సంగీత ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది.. ప్రేమ తొలి స్వరాలు మీ హృదయాన్ని తాకనివ్వండి.. దీవాన నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఇది ప్రేమ’ మార్చి 24న విడుదల కాబోతున్నది’ అని ప్రకటించారు.

కాగా.. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్‌పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి రూపొందిస్తున్న ‘దీవాన’ సినిమాను గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. ఇటీవల వాలెంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ఈ సినిమా స్టోరీ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ రాగా.. ఇంటెన్స్ లవ్ స్టోరీగా వస్తున్న ‘దీవాన’ హర్షిత్ రెడ్డి కెరీర్‌లో మరో గుర్తుండిపోయే సినిమా కానుంది.

Next Story