షాక్ ఇచ్చిన ‘దివానా’ టీమ్.. విడుదల వాయిదా, కొత్త డేట్ ఎప్పుడంటే?

by Pulgam srinivas |

'దీవానా' విడుదల జూన్ 19 నుంచి జూన్ 20కు వాయిదా పడింది.

షాక్ ఇచ్చిన ‘దివానా’ టీమ్.. విడుదల వాయిదా, కొత్త డేట్ ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: హర్షిత్ రెడ్డి, స్మేహా మనిమెగలై జంటగా నటించిన తాజా రొమాంటిక్ లవ్ స్టోరీ 'దీవానా'. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు కొద్ది రోజుల క్రితమే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అందుకు అనుగుణంగా ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అలాగే గత కొన్ని రోజులుగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. అంతా సజావుగా సాగుతోందని భావిస్తున్న సమయంలో మూవీ టీమ్ ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. ముందుగా ప్రకటించిన జూన్ 19కు బదులుగా, ఈ సినిమాను జూన్ 20న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఈ విడుదల వాయిదాకు ప్రధాన కారణం సెన్సార్ ప్రక్రియ పూర్తి కాకపోవడమేనని సమాచారం. అందువల్లే సినిమా విడుదల తేదీని ఒక రోజు వెనక్కి జరిపినట్లు తెలుస్తోంది. అయితే విడుదల వాయిదా పడినప్పటికీ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. వీకే నరేష్, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఈశ్వర్ చంద్ సంగీతం అందించారు. వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మాతలుగా వ్యవహరించారు.




Next Story