- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Deepika Pilli: నాకు అసలు కథ కూడా చెప్పలేదు.. యంగ్ హీరోయిన్ వైరల్ కామెంట్స్
బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి (Deepika Pilli) కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju), జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి (Deepika Pilli) కాంబినేషన్‌లో వస్తున్న మూవీ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ (Akkada Ammayi Ikkada Abbayi). నితిన్, భరత్ కలిసి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గైడ్, జాన్ విజయ్ జీఎమ్ సుందర్, రోహిణి, ఝాన్నీ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకోగా.. పాజిటివ్ ఎక్స్‌పెక్టేషన్స్ (Positive Expectations) మధ్య ఈ మూవీ ఏప్రిల్ 11న థియేటర్‌లలో సందడి చేయనుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ (Trailer) ఫుల్ కామెడీ ఎంటర్‌టైనింగ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దీపిక పిల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
‘నేను ఇందులో రాజకుమారి అనే పాత్రలో కనిపిస్తాను. అసలు ఫస్ట్ నాకు వీళ్లు కథ చెప్పలేదు. అయితే.. ఇంతకు ముందు నేను వీళ్లతో వర్క్ చేశాను. నితిన్, భరత్, ప్రదీప్ వీళ్లందరితో నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో.. నాకు కథ చెప్పకుండా ఇలా సినిమా తీద్దాం అనుకుంటున్నాము అనగానే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. వెంటనే ఓకే చెప్పేశాను. ఆ తర్వాత షూట్‌కి ఇంకా వారం ఉంది అనగా అప్పుడు నాకు నరేషన్ ఇచ్చి ఇది నీ పాత్ర ఇలా చెయ్యాలి అని చెప్పారు. నాకు వీళ్లతో వర్క్ చెయ్యడానికి భయం కూడా అనిపించలేదు. నేను సెట్‌లో ఒక్కదాన్నే అమ్మాయిని.. వీళ్లు నన్ను చాలా బాగా చూసుకునే వారు’ అంటూ చెప్పుకొచ్చింది.






