- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deepika Padukone: యంగ్ హీరోయిన్‌కు తల్లిగా నటించనున్న దీపికా పదుకొణె.. నెట్టింట వైరల్‌గా మారిన షాకింగ్ ట్వీట్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె(Deepika Padukone) ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె(Deepika Padukone) ఒకప్పుడు వరుస సినిమాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది ఫైటర్, సింగం అగైన్(Singam Again) వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఊహించిన విధంగా హిట్ సాధించలేకపోయాయి. ఇక ఈ క్రమంలోనే దీపికా పదుకొణె ప్రెగ్నెంట్ కావడంతో చివరిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ‘కల్కి’ మూవీలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే దీపికా పదుకొణె సెప్టెంబర్ నెలలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక అప్పటి నుంచి ఈ అమ్మడు తల్లిగా తన కూతురు ఆలనా పాలనా చూసుకుంటూ ఇంటికే పరిమితం అయింది. అప్పుడప్పుడు పలు ఈవెంట్స్‌లో పాల్గొంటూ మళ్లీ ప్రేక్షకులకు దగ్గరవుతోంది.
అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నెట్టింట పలు ఫొటోలు షేర్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, దీపికా పదుకొణె మళ్లీ ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. హీరోయిన్‌కు తల్లి పాత్రలో నటించనున్నట్లు టాక్. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan), సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో రాబోతున్న ‘కింగ్’ మూవీలో దీపికా కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాలో షారుఖ్ కూతురు సుహానా ఖాన్ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక ఆమెకు తల్లిగా దీపికా పదుకొణె నటించనున్నట్లు నెట్టింట ఓ పోస్ట్ చక్కర్లు కొడుతోంది.
షారుఖ్ సరసన దీపికా రొమాన్స్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అటు దీపిక కూడా ఈ మూవీలో భాగమయ్యేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కానుందట. అయితే ఇప్పటికే షారుఖ్, దీపికా కాంబోలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరోసారి ఈ హిట్ కాంబోలో మూవీ రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాంబో ఫైనలైజ్ అయితే బిగ్ స్క్రీన్‌పై మరోసారి షారుక్ ఖాన్- దీపిక పదుకొణెను చూడవచ్చు. అటు ఫ్యాన్స్ కూడా ఈ జోడీని ఆన్‌స్క్రీన్‌లో చూసేందుకు వెయిట్ చేస్తున్నారు. మరికొందరు తల్లిగా నటించడం గురించి తెలుసుకుని షాక్ అవుతున్నారు.






