- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Deepika Padukone: సినిమా కథ నచ్చింది కానీ పేమెంట్ నచ్చలేదు.. ఫైనల్‌గా ఓపెన్ అయిన దీపికా పదుకొణె (వీడియో)
ప్రజెంట్ ‘స్పిరిట్’ (Spirit) సినిమా ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: ప్రజెంట్ ‘స్పిరిట్’ (Spirit) సినిమా ఇష్యూ హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే.. ఈ మూవీ స్టార్టింగ్‌లో ఇందులో హీరోయిన్‌గా దీపికా పదుకుణె(Deepika Padukone)ను అనుకున్నారు. కానీ ఫైనల్‌గా త్రిప్తి డిమ్రి (Tripti Dimri)ని ఫిక్స్ చేస్తూ దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇచ్చేశాడు డైరెక్టర్. అప్పటి నుంచి ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కూడా ట్విట్టర్ వేదికగా సినిమా స్టోరీని కావాలనే లీక్ చేస్తున్నారంటూ పోస్ట్ పెట్టి సంచలనం సృష్టించాడు.
అయితే.. ఎవరు ఏంటీ అన్నది పేరు మాత్రం చెప్పలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దీపికె పదుకొణె కూడా దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. ‘రీసెంట్‌గా ఓ ఇన్సిడెంట్ జరిగింది. ఓ డైరెక్టర్ నాకు కథ చెప్పారు. క్రియేటివ్‌ల్లీ నాకు కథ చాలా నచ్చింది. ఇక మనీ గురించి మాట్లాడినప్పుడు.. నేను ఇంత చార్జ్ చేస్తా అని చెప్పాను. వాళ్లు దానికి ఒప్పుకోలేదు. అంతే నేను దానికి టాటా బైబై అన్నాను. ఎందుకంటే నా ట్రాక్ రికార్డ్ ఏంటో నాకు తెలుసు.. నేను ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ సినిమాకు ఒప్పుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.






