‘8 నుంచి 9 నెలల గర్భధారణ కాలం చాలా సవాలుతో కూడుకున్నది’.. ప్రముఖ నటి ఎమోషనల్ కామెంట్స్

by Kodari Anjali |

బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

‘8 నుంచి 9 నెలల గర్భధారణ కాలం చాలా సవాలుతో కూడుకున్నది’.. ప్రముఖ నటి ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ హీరోయిన్ పండండి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను గర్భవతిగా ఉన్నప్పటి పరిస్థితులు ఎలా ఎదుర్కుందో చెప్పుకొచ్చింది. మాతృత్వపు ప్రయాణంలో అనేక సవాళ్లు ఫేస్ చేశానని నటి దీపికా పదుకొణె చెప్పుకొచ్చింది. నెలలు నిండేకొద్ది కాస్త కష్టంగా అనిపించినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల గర్భధారణ కాలం చాలా సవాలుతో కూడుకున్నదని దీపికా చెప్పుకొచ్చింది.

ముఖ్యంగా చివరి త్రైమాసికంలో పక్కటెముకల నొప్పి.. అలాగే ఆమె శరీరంలో కొత్త నొప్పులను కనుగొనడం వంటి ముఖ్యమైన అసౌకర్యం, నొప్పిని ఆమె ప్రస్తావించింది. ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ, దీపిక తన సహాయక వ్యవస్థకు కృతజ్ఞతలు తెలిపింది. ఇప్పుడు తల్లిత్వంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ అటు ఫ్యామిలీని చూసుకుంటూనే ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటోంది. ఇకపోతే ప్రజెంట్ ఈ బ్యూటీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Next Story