- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షారుక్ ఆఫర్ వద్దనలేక ఆ పాత్రను ఓకే చేసిన దీపిక
షారుక్ ఆఫర్ కాదనలేక కింగ్ సినిమాలో తల్లి పాత్రలో దీపిక నటిస్తోందని, అలాగే అందుకోసం పారితోషికం కూడా తీసుకోవడం లేదని సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ ఇండస్ట్రీలో షారుక్ ఖాన్-దీపికా పదుకొణె జోడికి మంచి క్రేజ్ ఉంది. మొదటగా వీరిద్దరి కాంబినేషన్ లో ఓం శాంతి ఓం చిత్రం వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించింది. ఇందులోని వీరి జోడికి మంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో బిల్లు, చెన్నై ఎక్స్‌ప్రెస్, హ్యాపీ న్యూ ఇయర్, పఠాన్, జీరో, జవాన్ చిత్రాలు వచ్చాయి. ఇందులో చాలా వరకు విజయాలు సాధించడంతో హిట్ పెయిర్ గా వీరికి గుర్తింపు దక్కింది.
ప్రస్తుతం షారుక్ ఖాన్ 'కింగ్' చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో కూడా దీపిక కనిపించబోతుంది. కానీ ఈ బ్యూటీ పాత్ర ఇందులో చాలా తక్కువ సమయం ఉండబోతున్నట్లు తెలుస్తుంది. షారుక్ కుమార్తె సుహానా ఖాన్ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో దీపిక, సుహానాకు తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
ఈ పాత్ర నిడివి తక్కువే అయినా కూడా షారుక్ మీద అభిమానంతో అది చేయడానికి దీపిక ఒప్పుకున్నట్లు, అలాగే చాలా తక్కువ సమయం ఉండే పాత్ర కావడంతో అద్భుతమైన క్రేజ్ ఉండి పెద్ద మొత్తంలో పారితోషకం తీసుకుంటున్న సమయంలో కూడా రెమ్యూనరేషన్ లేకుండా ఈ సినిమాలో దీపిక నటిస్తున్నట్లు తెలుస్తోంది. వరుస ప్లాప్స్ రావడంతో కాస్త గ్యాప్ తీసుకున్న షారుక్ వరుసగా పఠాన్, జవాన్, డంకీ సినిమాలతో విజయాలను అందుకున్నాడు. మళ్ళీ కాస్త గ్యాప్ తీసుకున్న ఈ స్టార్ హీరో 'కింగ్'తో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.






