ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. మీరు లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఎమోషనల్ పోస్ట్

by Gugulothu.Kavitha |

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(PRIYANKA CHOPRA) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ప్రియాంక చోప్రా ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. మీరు లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నామంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(PRIYANKA CHOPRA) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న ‘ఎస్ఎస్ఎమ్‌బి-29’(SSMB-29) అనే మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. జూన్ 16న ఆమె మామ.. హీరోయిన్ మన్నారా చోప్రా తండ్రి రామన్ రాయ్ హండా మృతిచెందారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రామన్ రాయ్.. సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యింది ప్రియాంక. రామన్ రాయ్ మరణం పట్ల విచారం వ్యక్తం చేసింది. “”16/06/2025న మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లిపోయిన మా మామగారి విచారకరమైన మరణాన్ని తీవ్ర దుఃఖంతో మరియు బాధతో మేము తెలియజేస్తున్నాము. ఆయన మా కుటుంబానికి బల స్తంభం” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story