- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినీ రంగంలో తీవ్ర విషాదం: ‘సారంగా’ హీరో సుదేశ్ కుమార్ కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటుడు, 'సారంగా' చిత్ర కథానాయకుడు సుదేష్ కుమార్ (90) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: హిందీ చలనచిత్ర పరిశ్రమ (Bollywood)లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 1960వ దశకంలో తన నటనతో అలరించిన సీనియర్ నటుడు, నిర్మాత సుదేశ్ కుమార్ (90) కన్నుమూశారు. ఇవాళ తెల్లవారుజామున ముంబై (Mumbai)లోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. 1961లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘సారంగా’ చిత్రంతో ఆయన దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ సినిమాలోని పాటలు నేటికీ ఆహుతులను అలరిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘ఉల్ఝన్’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో ఆయన నటించారు. కేవలం సుదేశ్ కుమార్ నటుడిగానే కాకుండా, నిర్మాతగా కూడా ఆయన సినీ రంగానికి సేవలు అందించారు. ‘ఉల్ఝన్’ చిత్రానికి ఆయన నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే, సుదేశ్ కుమార్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు.






