Director Mehar Ramesh : టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం

by Muthe.Rajitha |

టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Director Mehar Ramesh : టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ ఇంట్లో తీవ్ర విషాదం
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. డైరెక్టర్ మెహర్ రమేష్(Director Mehar Ramesh) సోదరి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. మెహర్ రమేష్ సోదరి మాదాసు సత్యవతి(Madasu Satyavathi) గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈ క్రమంలో నేడు హైదరాబాద్(Hyderabad) లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. కాగా సత్యవతి మృతిపై ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్(AP Deputy CM Pavan Kalyan) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో మెహర్ కుటుంబం విజయవాడలోని మాచవరం ప్రాంతంలో నివసించేదని, పాఠశాల రోజుల్లో వేసవి సెలవుల(Summer Holidays)కు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళమని పవన్ గుర్తు చేసుకున్నారు. సత్యవతి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Next Story