- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యంగ్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. కన్నీళ్లు తెప్పిస్తున్న ఎమోషనల్ పోస్ట్
యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) ‘ఆర్ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) ‘ఆర్ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇక చివరిగా నటించిన ‘మంగళవారం’(Mangalavaram) మూవీతో మంచి విజయం తన ఖాతాలో వేసుకుంది. ప్రజెంట్ ‘వెంకట లచ్చిమి’(Venkata Lachimi) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. మరోపక్క నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. లేటెస్ట్, బోల్డ్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌కు లచ్‌లో ఉంటుంది.
ఈ క్రమంలో ఈ చిన్నదాని పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అందులో తన తండ్రి అకాల మరణం చెందాడని తెలుపుతూ ఎమోషనల్ అయింది. ఈ మేరకు అతని ఫొటోను షేర్ చేస్తూ.. ‘క్యాన్సర్‌తో పోరాడటానికి నేను మీకు సహాయం చేయడానికి నేను చేయగలిగినదంతా చేశాను, కానీ నేను విజయం సాధించలేకపోయాను. క్షమించండి, నేను మిమ్మల్ని మరొక వైపు చూస్తాను. లవ్ యూ నాన్న’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్స్ పాయల్‌ను స్ట్రాంగ్‌గా ఉండాలని చెబుతూ కామెంట్స్ చేస్తున్నారు.






