- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిందీ మార్కెట్‌పై కన్నేసిన డెకాయిట్ టీమ్… క్రేజీ సంస్థలతో భారీ డీల్.
డెకాయిట్’ హిందీ హక్కులను పీవీఆర్, ఐనాక్స్ సంస్థలు దక్కించుకున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటుడు అడివి శేష్ తాజాగా ‘డెకాయిట్’ చిత్రంలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈ మూవీ యూనిట్ తాజాగా ఓ క్రేజీ అప్డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను ప్రముఖ మల్టీప్లెక్స్ సంస్థలు పీవీఆర్ మరియు ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ రెండు సంస్థలకు మంచి గుర్తింపు ఉండటంతో, హిందీ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు భారీ స్థాయిలో విడుదల లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా కనిపించనుండగా, ఈ సినిమాకు షానీల్ డియో దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. బాలీవుడ్ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో కీలకమైన పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.






