‘డియర్ కామ్రేడ్’ రీమేక్

by Sujitha Rachapalli |

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ‘డియర్ కామ్రేడ్’. 2019లో వచ్చిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్స్ ఆరేళ్ల క్రితమే ఈ మూవీ రైట్స్ తీసుకున్నారు.

‘డియర్ కామ్రేడ్’ రీమేక్
X

దిశ, సినిమా : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన తెలుగు బ్లాక్ బస్టర్ మూవీ ‘డియర్ కామ్రేడ్’. 2019లో వచ్చిన ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్స్ ఆరేళ్ల క్రితమే ఈ మూవీ రైట్స్ తీసుకోగా.. పాండమిక్ కారణంగా ప్రాజెక్ట్ ఆగిపోయింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం సిద్ధాంత్ చతుర్వేది, ప్రతిభా రంతా లీడ్ రోల్స్‌కి ఫిక్స్ అయ్యారని టాక్. దీనిపై త్వరో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ రూమర్స్‌పై రియాక్ట్ అయిన సిద్ధాంత్.. నో మోర్ రీమేక్స్ ఫర్ మీ.. అని క్లారిటీ ఇచ్చాడు. అయితే ప్రతిభ మాత్రం అధికారిక ప్రకటన కోసం వెయిట్ చేయండి అని చెప్పింది. అయితే సినీ లవర్స్ మాత్రం విజయ్, రష్మికనే రీమేక్‌లో కూడా నటస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story