- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్డంగా దొరికిపోయిన డియర్ కామ్రేడ్ డైరెక్టర్.. ఈ సీన్‌ను ఎక్కడ నుండి లేపేశాడంటే?
సినిమాలను డైరెక్టర్లు సొంతంగా కథలు రాసుకుని, తమ క్రియేటివిటీతో తీస్తారని చాలా మంది అనుకుంటారు.

దిశ, వెబ్ డెస్క్: సినిమాలను డైరెక్టర్లు సొంతంగా కథలు రాసుకుని, తమ క్రియేటివిటీతో తీస్తారని చాలా మంది అనుకుంటారు. ఇది నిజమే అయినా కొన్నిసార్లు సీన్లను, మ్యూజిక్‌ను, పాటలను ఇతర సినిమాల నుండి కూడా లేపేస్తుంటారు. అయితే ఒకప్పుడు ఇతర భాష చిత్రాల నుండి ఏమైనా కాపీ కొట్టినా వాటిని చూసేవారు ఉండరు కాబట్టి అస్సలు దొరక్కపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. ప్రేక్షకులు కేవలం ఇండియన్ లాంగ్వేజ్ చిత్రాలనే కాకుండా విదేశీ సినిమాలను సైతం చూస్తున్నారు. ఫ్రెంచ్ కొరియన్ సినిమాలను సైతం వదలడంలేదు. దీంతో డైరెక్టర్లు ఎక్కడ కాపీ కొట్టినా దొరికిపోతున్నారు.
తాజాగా డియర్ కామ్రేడ్ డైరెక్టర్ భరత్ కమ్మ కూడా అలాగే దొరికిపోయాడు. డియర్ కామ్రేడ్ సినిమాలోని ఓ పాటలో సన్నివేశాలను కాపీ కొట్టి అడ్డంగా బుక్ అయ్యాడు. సినిమాలోని ఓ పాటలో హీరోయిన్ వ్యాయామం చేస్తుంటే హీరో వెనకనుండి చూసి దొరికిపోతాడు. అప్పుడు హీరోయిన్ కూడా సిగ్గుపడుతుంది. ఈ సన్నివేశానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ సన్నివేశాన్ని పోలిన ఓ కొరియన్ సీన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అచ్చం ఆ సన్నివేశం కూడా డియర్ కామ్రేడ్ మాదిరిగానే ఉంది. ఇక ఆ సన్నివేశం కొరియన్ సినిమా వన్స్ ఇన్ ది సమ్మర్ సినిమాలోనిది. డియర్ కామ్రేడ్ 2019లో ప్రేక్షకుల ముందుకు వస్తే వన్స్ ఇన్ ఎ సమ్మర్ 2006లోనే విడుదలైంది. దీంతో డైరెక్టర్ భరత్ ను నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. video






