- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డే బై డే.. రికార్డ్ బై రికార్డ్.. మన శంకర వరప్రసాద్ గారు కలెక్షన్ల మోత..(పోస్ట్)
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.

దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్‌గారు’ (mana shankara varaprasad garu)సినిమా జనవరి 12న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించారు.
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), క్యాథరీన్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh) గెస్ట్ రోల్‌లో కనిపించారు. ఇక ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండగా, ఫెస్టివల్ సీజన్‌కు తగ్గట్టు సినిమా థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. అలా సినిమా విడుదలైన రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీలా దూసుకెళ్తోంది.
ఈ క్రమంలో ఈ మూవీ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. అలా రిలీజ్ అయిన కేవలం ఆరు రోజుల్లోనే రూ.261 కోట్లకు పైగా గ్రాస్ సాధించినట్లు మేకర్స్ తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పెషల్ ట్వీట్ చేశారు. డే బై డే.. రికార్డ్ బై రికార్డ్.. మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద హిస్టరీ క్రియేట్ చేస్తోంది’ అని రాసుకొస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Read More..
Mana Shankara Vara Prasad Garu : ఐదో రోజు హవా.. ఆల్ టైమ్ రికార్డ్ కలెక్షన్స్..






