- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
AA22 టైటిల్‌కు ముహూర్తం ఫిక్స్!
అల్లు అర్జున్ బర్త్ డే స్పెషల్‌గా ‘AA22xA6’ సినిమా టైటిల్ విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.

దిశ, సినిమా: అల్లు అర్జున్–అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రాబోతున్నది. ప్రస్తుతం ‘AA22xA6’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం మేరకు ఐకాన్ స్టార్ బర్త్‌డే స్పెషల్‌గా బిగ్ ట్రీట్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ మేరకు ‘AA22xA6’ సినిమా టైటిల్‌తో పాటు టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. టైటిల్ లుక్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉండబోతుందని తెలుస్తుండగా.. ఏప్రిల్ 7 లేదా 8 తేదీల్లో టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయాలని మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజం అయితే.. అల్లు అర్జున్ బర్త్‌డే సర్‌ప్రైజ్ ట్రీట్ ఫ్యాన్స్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపిద్ది అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. దీపికా పదుకోనె హీరోయిన్‌గా నటిస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.






