NTR-నీల్ మూవీ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్..అర్ధ‌రాత్రి నుంచే సంబ‌రాలు!

by velandi.Saikiran |

NTR-నీల్ మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కు ముహుర్తం ఫిక్స్ అయింది.

NTR-నీల్ మూవీ గ్లింప్స్ కు డేట్ ఫిక్స్..అర్ధ‌రాత్రి నుంచే సంబ‌రాలు!
X

దిశ‌, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నందమూరి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. RRR సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మూవీపై క్రేజీ అప్డేట్ వచ్చింది.

ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు ఉంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేసింది. అయితే 19వ తేదీన అర్ధరాత్రి విడుదల చేయనున్నట్లు మరో న్యూస్ వైరల్ గా మారింది. ఈ గ్లింప్స్ మూడు నిమిషాల పాటు ఉంటుందని టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అయితే ఈ గ్లింప్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ను చూపిస్తారా ? లేక ఏదైనా మ్యాజిక్ చేస్తారా ? అనేది చూడాలి. కాగా ఈ సినిమాకు డ్రాగ‌న్ అనే టైటిల్ అనుకుంటున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇందులో ఎన్టీఆర్ స‌ర‌స‌న రుక్మిణి వసంత్ హీరోయిన్ గా చేయ‌నున్నారు.

Next Story