రామ్ 'RAPO23' పూజా కార్యక్రమాల తేదీ ఖరారు

by Pulgam srinivas |

'RAPO23' సినిమా పూజా కార్యక్రమాలు జూన్ 29న నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

రామ్ RAPO23 పూజా కార్యక్రమాల తేదీ ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, స్వయంగా కథ రాసి దర్శకత్వం వహించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనను ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసింది. అయితే టైటిల్‌ను ఇంకా ఖరారు చేయకపోవడంతో ప్రస్తుతం ఈ చిత్రాన్ని 'RAPO23' అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు రేపు అంటే జూన్ 29న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ చిత్రంలో కథానాయికగా శ్రీనిధి శెట్టి సహా పలువురు నటీమణుల పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ, చివరికి నివేదా పేతురాజ్‌ను హీరోయిన్‌గా ఖరారు చేశారు. రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తున్నారు.




Next Story