పాడుబడ్డ స్థితిలో దాసరి నారాయణరావు సమాధి.. షాకింగ్ వీడియో వైరల్

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాడుబడ్డ స్థితిలో, చుట్టూ చెట్లు మొలిచి ఉన్న సమాధి దృశ్యాలను ఓ నటి సోషల్ మీడియాలో షేర్ చేసింది.

పాడుబడ్డ స్థితిలో దాసరి నారాయణరావు సమాధి.. షాకింగ్ వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ దర్శకరత్న దాసరి నారాయణరావు సమాధికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాడుబడ్డ స్థితిలో, చుట్టూ చెట్లు మొలిచి ఉన్న సమాధి దృశ్యాలను ఓ నటి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఓ షూటింగ్ కోసం చేవెళ్ల వెళితే అక్కడ దాసరి సమాధి కనిపించినట్టు తెలిపింది. లెజెండరీ డైరెక్టర్, యాక్టర్ సమాధి ఈ స్థితిలో ఉండటం తనను బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నో సినిమాలకు దర్శకత్వం చేసి, చాలా మందికి లైఫ్ ఇచ్చిన దాసరి సమాధి ఇలాంటి స్థితిలో ఉంటుందని అనుకోలేదని చెప్పింది. పక్కనే ఆయన సతీమణి సమాధి కూడా అలాంటి స్థితిలోనే ఉందని ఆవేదన చెందింది. ప్రస్తుతం ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీంతో దాసరి కుటుంబ సభ్యులపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల ఆస్తులు ఇచ్చినా దాసరి కుటుంబ సభ్యులు కనీసం వారి సమాధులను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. కనీసం ఇండస్ట్రీ అయినా పట్టించుకోవాలని కోరుతున్నారు. ఇక యువతి వీడియోపై నటుడు మంచు మనోజ్ స్పందించారు. దాసరి నారాయణరావు సమాధిని ఇలా చూడటం చాలా బాధగా ఉందని అన్నారు. తెలుగు సినిమాకు ఎంతో సేవ చేసి, చాలా జనరేషన్లకు ఆదర్శంగా నిలిచిన దాసరి నారాయణరావు సమాధిని ఖచ్చితంగా శుభ్రం చేయల్సిన అవసరం ఉందన్నారు. సమాధి పరిస్థితిని వెలుగులోకి తీసుకువచ్చిన నటికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

Next Story