‘ఫౌజీ’ నుంచి డార్లింగ్ లుక్ లీక్.. అదుర్స్ అంతే అంటున్న ఫ్యాన్స్(పోస్ట్)

by I. Sairam |   (  Updated:2025-03-01 12:21:46  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో మన ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు.

‘ఫౌజీ’ నుంచి డార్లింగ్ లుక్ లీక్.. అదుర్స్ అంతే అంటున్న ఫ్యాన్స్(పోస్ట్)
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రీసెంట్‌గా ‘కల్కి 2898ఏడీ’(Kalki 2898AD) మూవీతో మన ముందుకు వచ్చి.. బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), దీపిక పదుకొణె(Deepika Padukone), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దిశా పటానీ(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suresh) వంటి ప్రముఖులు కీ రోల్ ప్లే చేశారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ.2000 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ప్రస్తుతం ప్రభాస్.. ‘ఫౌజీ’(Fouji), ‘కల్కి-2’(Kalki-2), ‘సలార్-2’(Salar-2), ‘రాజా సాబ్’(Raja Saab), ‘స్పిరిట్’(Spirit) వంటి భారీ బడ్జెట్ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డార్లింగ్ సరసన ఇమాన్వీ(Imanvi) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), వై. రవిశంకర్(Y.ravi Shankar) నిర్మిస్తున్నారు.

ఇక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి హీరో ప్రభాస్ లుక్ లీక్ అయింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మన డార్లింగ్ సూటు, బూటులో స్టైలీష్‌గా కనిపిస్తున్నారు. అలాగే ఆరడుగుల అందంతో యూత్‌ను ఫిదా చేస్తున్నాడు. దీంతో ఈ పిక్ నెట్టింట వైరల్‌గా మారగా.. ఫ్యాన్స్ అదుర్స్ అంటుంటే మరికొంత మంది ఇది సాహో సినిమాలోని లుక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫొటో ఏ సినిమాలోనిది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Next Story