ఎమోషనల్ థ్రిల్లర్‌‌గా ‘డార్క్ నైట్’

by Chukka Sudharani |

నటి పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం ‘డార్క్ నైట్’.

ఎమోషనల్ థ్రిల్లర్‌‌గా ‘డార్క్ నైట్’
X

దిశ, సినిమా: నటి పూర్ణ ప్రదాన పాత్రలో రూపొందిన ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం ‘డార్క్ నైట్’. మార్చ్13న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి జి.ఆర్. ఆదిత్య దర్శకత్వం వహించారు. పూర్ణతో పాటు త్రిగుణ్, విధార్థ్, సుభాశ్రీ రాయగురు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతున్న క్రమంలోనే ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘పూర్ణ ప్రదాన పాత్రలో నటించిన “డార్క్ నైట్” చిత్రం మార్చ్13న రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విదుదల చేస్తున్నాం. డార్క్ నైట్ నాలుగు ప్రధాన పాత్రల జీవితాల చుట్టూ తిరుగుతుంది. వారి మధ్య ఉన్న సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు కథను ఉత్కంఠభరితంగా మలుస్తాయి. కథ ముందుకు సాగుతున్న కొద్దీ ప్రేక్షకులు భావోద్వేగాలతో నిండిన ప్రయాణాన్ని అనుభవిస్తారు. ఈ చిత్రంలో అతీంద్రియ అంశాలతో కూడిన ఒక ఊహించని ట్విస్ట్ కథను కొత్త మలుపు తిప్పుతూ ప్రేక్షకులను ఆశ్చర్యపరచడమే కాకుండా మరపురాని సినిమాటిక్ అనుభవాన్ని ఇస్తుంది’ అన్నారు.

Next Story