- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుల వ్యవస్థ మీద ‘దండోరా’.. ఆకట్టుకుంటున్న ట్రైలర్..
లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుండగా.. ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఊరి బయట కొంత మంది శవాన్ని మోసుకెళ్తుంటారు. ఇంత దూరం శవాన్ని ఎందుకు మోసుకు రావాలని వారితో పాటు

దిశ, సినిమా : లవ్, ఎమోషన్, డ్రామా వంటి కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు చక్కటి సోషల్ మెసేజ్‌తో రూపొందిన చిత్రం ‘దండోరా’. డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా రిలీజ్ కాబోతుండగా.. ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘ఊరి బయట కొంత మంది శవాన్ని మోసుకెళ్తుంటారు. ఇంత దూరం శవాన్ని ఎందుకు మోసుకు రావాలని వారితో పాటు వచ్చే చిన్న పిల్లాడు అడుగుతాడు. దానికి వాళ్లు.. ‘మన చావు పుట్టకులన్నీ ఆ ఊరి బయట రాసిండ్రా ఆ దేవుడు..’ ‘విష్ణుగాడొచ్చి కాళ్లు పట్టుకున్నా పని కాదని సర్పంచ్ సాబ్ చెబుతున్నాడా అని నందుతో మురళీధర్ పాత్ర చెప్పగానే.. నువ్వు ఉన్నోడివి ఉండకుండా ఆ సర్పంచ్‌గానికి ఎందుకు చెప్పినావ్..వాడేమన్నా పెద్ద లాడ్డా’ అని నందు చెప్పటం.. ‘ఒటేసినావ్‌రా అని’ నవదీప్ తన పక్క నుంచే వాడిని అడిగితే ‘ఎంత పెద్ద మాటన్నావ్ సర్పంచ్ నీ గుర్తుకే గుద్దినా’ అని వాడంటాడు. దానికి ‘ఓటుకి గుద్దినావో.. క్వార్టర్ గుద్ది ఇంట్లో పండినావో ఎవడు చూసిండవయ్యా’ అని నవదీప్ రియాక్ట్ కావటం.. ‘ఒక ముద్దు పెట్టుకుంటానే అని రవికృష్ణ పాత్ర మణిక పాత్రను రిక్వెస్ట్ చేస్తే ఆమె ఏమో చెంప పగుల్తాది’ అని సీరియస్‌గా వార్నింగ్ ఇస్తది. మరో సీన్లో అయితే శివాజీ సీరియస్‌గా ఒకర్ని కాలితో తన్ని.. ‘భయపడ్డావా.. పడాలి’ అంటూ వార్నింగ్ ఇవ్వటం.. ఊర్లో అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన నవదీప్ ప్రెసిడెంట్‌గా ఎన్నికవడం.. అక్కడి నుంచి ఊర్లో వచ్చే సమస్యలతో కుల పెద్దలకు, అతనికి మధ్య తలెత్తే ఘర్షణలు అద్భుతంగా చూపించారు. ఇలాంటి కుల వ్యవస్థ మీద ఆ గ్రామంలో ఎవరు దండోరా వేశారు.. చివరకు ఏం జరిగింది? అనేదే ఈ సినిమా.






