- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ‘దండోరా’
‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో సినిమా ‘దండోరా’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా.. మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బింధు మాధవి కీలక పాత్రల్లో కనిపింబోతున్నారు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్

దిశ, సినిమా : ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించిన లౌక్య ఎంటర్‌టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో సినిమా ‘దండోరా’. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాతగా.. మురళీ కాంత్ దర్శకత్వం వహిస్తున్న మూవీలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బింధు మాధవి కీలక పాత్రల్లో కనిపింబోతున్నారు. డిసెంబర్ 25న మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ రిలీజ్ కార్యక్రమం నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన నటుడు శివాజీ.. ‘‘తెలంగాణ రూటెడ్ ఫిల్మ్ ఇది. నాకు డైరెక్టర్‌గారు స్క్రిప్ట్ చెప్పగానే ఏం చదువుకున్నారని అడిగాను. నేను అమెరికా నుంచి వచ్చానని అన్నాడు. ఇది ఎమోషన్స్‌తో కూడిన కమర్షియల్ మూవీ. ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్స్, డ్రామా, ఎగ్రెషన్ అన్నీ ఉన్నాయి. టైటిల్ వినగానే వన్ సైడ్ అయిపోతుందిగా అన్నాను. కానీ అది కాదు.. కామెడీ ఉన్నా అది ‘దండోరా’ వేసినట్లే ఉంటుంది. ఎమోషన్స్ ఏదైనా దండోరా వేసినట్లే ఉంటుంది. కోర్ట్ కన్నా ముందే ఈ సినిమాను నేను కమిట్ అయ్యాను. ఫుల్లీ కంటెంట్ లోడెడ్ మూవీ. ఏ లాంగ్వేజ్‌లో వచ్చినా సినిమా ఆడుతుందనేది నా అభిప్రాయం. స్క్రీన్ స్పేస్ అనేది పక్కన పెడితే ఇందులో నటించిన అందరికీ ఓ ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్‌కి ఓ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది’ అని తెలిపాడు. కార్యక్రమానికి మైత్రీ శశిధర్, దర్శకుడు మురళీకాంత్, నిర్మాత రవీంద్ర బెనర్జీ ముప్పనేని, హీరో నందు, మ్యూజిక్ డైరెక్టర్ మార్క్ కె రాబిన్, హీరోయిన్ మణిక తదితరులు హాజరయ్యారు.






