- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘న్యాయం చేయరా దేవుడా’ అంటున్న డ్యాన్సర్ శ్రష్టి వర్మ
‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇస్తుంది డ్యాన్సర్ శ్రష్టి వర్మ. ఇందులో ఐటెమ్ సాంగ్ చేయబోతుండగా.. తాజాగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

దిశ, సినిమా: డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ త్వరలో వెండితెర ఎంట్రీ ఇవ్వనుంది. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రంతో శ్రష్టి ఓ ఐటెం సాంగ్ చేయబోతున్నది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం మ్యూజికల్ ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేసి.. ఐటెం సాంగ్ అప్డేట్ ఇస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. ‘ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయికుమార్, సుమన్‌లతో పాటు యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు లేని విధంగా.. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఈ చిత్రంలో ఓ ఐటెం సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ లిరికల్ సాంగ్‌తో మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ఈ సాంగ్‌లో శ్రష్టి వర్మ స్టెప్స్ అందరినీ కనువిందు చేయనున్నాయి. ఈ వారంలోనే సాంగ్‌ని రిలీజ్ చేయనున్నాం’ అని తెలిపారు.
- Tags
- Shrasti Verma






