- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘డాకు మహారాజ్’ ట్రైలర్ రిలీజ్.. ఇక్కడ ఉన్నది కింగ్ ఆఫ్ జంగిల్ అంటూ బాలకృష్ణ తాండవం చూపించేశారుగా
నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ).

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’(Daaku Maharaj ). ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాని.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments) బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య(Sai Sowjanya) నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, మూడు పాటలు మూవీ పై భారీ అంచనాలను పెంచాయి. అయితే ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్(Trailer) లాంచ్ ఈవెంట్‌ని నేడు అమెరికా(America)లోని డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఇక ఈ ట్రైలర్‌ను గమనించిట్లయితే .. ‘అనగనగా ఓ రాజు ఉండేవాడు. చెడ్డవాళ్ళంతా ఇతన్ని డాకు అనేవాళ్ళు, కానీ మాకు మాత్రం మహారాజు’ అంటూ చిన్న పిల్లవాడి వాయిస్‌తో స్టార్ట్ అయినా ఈ ట్రైలర్‌లో బాలయ్య డబల్ రోల్ అని, ఒకటి ప్రస్తుతం జరిగే కథ, మరోటి పీరియాడిక్ యాక్షన్ అని తెలుస్తుంది. అలాగే చిన్న పాప ఎమోషన్‌తో పాటు ప్రజలను కాపాడే హీరో లాంటి కథగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ‘అడవిలో ఎన్ని క్రూర మృగాలు ఉన్నా ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడు’ అంటూ బాలయ్య గురించి చెప్పిన డైలాగ్ అదుర్స్. ఫైనల్‌గా ఈ ట్రైలర్‌లో బాలయ్య తాండవాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది.






