- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Daksha Nagarkar : వరుణ్ తేజ్ సినిమాలో బోల్డ్ బ్యూటీ.. హైప్ పెంచేస్తున్న ట్వీట్
మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం ‘VT-15’ కోసం సిద్ధం అవుతున్నాడు.

దిశ, సినిమా: మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రస్తుతం ‘VT-15’ కోసం సిద్ధం అవుతున్నాడు. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఇండో-కొరియన్ హారర్ కామెడీ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతుండగా.. దీనికి ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanaka Raju) అనే టైటిల్ ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. సరికొత్త జోనర్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తమన సంగీతం అందిస్తున్న ఈ మూవీకి ఇప్పటికే వచ్చిన అప్‌డేట్స్ ఆకట్టుకుటున్నాయి. అలాగే.. సినిమా అనౌన్స్‌మెంట్ వీడియోతో VT-15పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ మూవీపై మరిన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా తన అందచందాలతో కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తున్న బోల్డ్ బ్యూటీ దక్షా నాగర్కర్ (Daksha Nagarkar) ‘కొరియన్ కనకరాజు’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ (Special song)లో మెరవనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఐటెమ్ సాంగ్‌కు సంబంధించి హైదరాబాద్‌లో ఆచార్య సెట్‌లో షూటింగ్ జరగుతుందట. ఇందులో వరుణ్ తేజ్‌తో దక్షా నాగర్కర్ చిందులు వేస్తుందని తెలుస్తుంది. అయితే.. ఈ విషయంపై మాత్రం మూవీ టీమ్ ఇంకా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వనప్పటికీ మెగా ఫ్యాన్స్ మాత్రం పండుగ చేసుకుంటున్నారు. ఈ స్పెషల్ సాంగ్ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్(Special attraction)గా నిలవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






