బై బై మృణాల్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

by Sujitha Rachapalli |

వరుస బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న అడివి శేష్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘డకాయిట్’తో అలరించబోతున్నాడు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మృణాల్ ఠాకూర్ కథానాయిక.

బై బై మృణాల్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్
X

దిశ, సినిమా : వరుస బ్లాక్‌బస్టర్‌లతో దూసుకుపోతున్న అడివి శేష్ ఇప్పుడు తన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘డకాయిట్’తో అలరించబోతున్నాడు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. మృణాల్ ఠాకూర్ కథానాయిక. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా.. తాజాగా మృణాల్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఆమెకు ఘనంగా సెండ్ అఫ్ ఇచ్చింది. మూవీ రిలీజ్ టైంలో ప్రమోషన్ ఈవెంట్స్‌లో పాల్గొననున్న బ్యూటీ.. ఈ చిత్రానికి తెలుగు, హిందీలో తనే స్వయంగా డబ్బింగ్ చెప్తుండటం విశేషం. ఈ చిత్రంలో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, అతుల్ కులకర్ణి, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత కాగా అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. తెలుగు నూతన సంవత్సరం అయిన ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు.

Next Story