Daaku Maharaj: వరల్డ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన డాకు మహారాజ్.. ఏ ఛానల్‌లో ఎప్పుడంటే?

by Chukka Sudharani |

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వచ్చిన మూవీ ‘డాకు మహారాజ్’.

Daaku Maharaj: వరల్డ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైన డాకు మహారాజ్.. ఏ ఛానల్‌లో ఎప్పుడంటే?
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో వచ్చిన మూవీ ‘డాకు మహారాజ్’. ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. అలాగే ఈ మూవీలో బోల్డ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా ఐటెం సాంగ్‌లో చిందులేసి మెప్పించింది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఫిబ్రవరి 21నుంచి తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై.. అక్కడ కూడా మంచి వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం వరల్డ్ టీవీ ప్రీమియర్‌కు సిద్ధమైంది. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది ‘స్టార్ మా’ ఛానెల్. ‘వేటగాడు.. ‘డాకు మహారాజు’ జులై 13 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ ఆదివారం సాయంత్రం 6గంటలకు.. స్టార్ మాలో మాత్రమే చూడండి’ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతుండగా.. ‘జై బాలయ్య’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. Link

Next Story