- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Sreeleela: క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్.. సోషల్ మీడియా ట్రెండింగ్‌లో శ్రీలీల వీడియో
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి.. ‘ధమాకా’ (Dhamaka)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) ‘పెళ్లి సందడి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయి.. ‘ధమాకా’ (Dhamaka)తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకున్న శ్రీలీల క్రేజీ బ్యూటీగా మారిపోయింది. గతంలో ఆమె చేతిలో ఒకేసారి పది ఆఫర్లు ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. కానీ వరుసగా నాలుగు ఫ్లాప్స్ అందుకోవడంతో అమ్మడు క్రేజ్ తగ్గిపోయింది. దీంతో ఆమెను హీరోయిన్‌గా తీసుకున్న ప్రాజెక్ట్స్ నుంచి కూడా తొలగించేశారు.
ఇక 2023లో శ్రీలీల నటించిన ‘భగవంత్ కేసరి’(Bhagavant Kesari) మూవీ సూపర్ హిట్ కావడంతో మరోసారి ఫామ్‌లోకి వచ్చింది. కానీ గత ఏడాది శ్రీలీల, మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’(Guntur Kaaram) ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘రాబిన్‌హుడ్’(Robinhood) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నితిన్ హీరోగా నటిస్తుండగా.. వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి శర వేగంగా జరుగుతున్న ‘రాబిన్‌హుడ్’ మూవీ వాయిదాలు పడుతూ వస్తుంది. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ మార్చి 28న విడుదల కాబోతున్నట్లు వెల్లడించారు. ఇక అప్పటి నుంచి వరుస అప్డేట్స్ రిలీజ్ చేస్తూ హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ శ్రీలీల క్యూట్ వీడియోను షేర్ చేశారు. రాబిన్‌హుడ్ పాటను కేక్‌తో రీక్రియేట్ చేసిన ఆమె అదిరిపోయే ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చింది. ఇక ఈ వీడియోకు క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం శ్రీలీల వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అని కామెంట్లు చేస్తున్నారు.






