అమలాపురంలో ‘క్రైమ్’

by Sujitha Rachapalli |

కావ్య మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై అజయ్ కుమార్ దర్శకత్వంలో సీనియర్ ఆర్టిస్టులతో పాటు న్యూ టాలెంటెడ్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తూ నిర్మిస్తున్న చిత్రం క్రైమ్.

అమలాపురంలో ‘క్రైమ్’
X

దిశ, సినిమా : కావ్య మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై అజయ్ కుమార్ దర్శకత్వంలో సీనియర్ ఆర్టిస్టులతో పాటు న్యూ టాలెంటెడ్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేస్తూ నిర్మిస్తున్న చిత్రం క్రైమ్. ఈ సినిమా ఫిబ్రవరి చివరి వారంలో మొదలవుతుందని ఈ సినిమా మొదటి షెడ్యూల్ అమలాపురంలో 15 రోజులపాటు షూట్ చేస్తారని దర్శకుడు అజయ్ కుమార్ తెలిపారు ఈ చిత్రం రెండు షెడ్యూలలో పూర్తవుతుందని తెలిపారు ఈ చిత్రం ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ తో పాటు క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందించడంతోపాటు యువతకు సామాజిక బాధ్యతను కూడా గుర్తు చేసే విధంగా ఉంటుందని, మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ గోవా అమలాపురం,యానం,హైదరాబాదు, వరంగల్ తదితర ప్రాంతాలలో జరుపుకోనున్నట్లు కథకు తగ్గట్టుగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించనున్నట్లు నిర్మాత కావ్య తెలిపారు.

Next Story