ఫ్యాన్స్ వార్ సృష్టించడం వల్ల జరిగేదేం ఉండదు.. హీరోయిన్ల కాళ్లు మొక్కిన వైరల్ ఫొటోపై ఊర్వశి ఫైర్

by Chukka Sudharani |   (  Updated:2026-05-28 10:37:16  IST  )

సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఉండటం కామన్. అయితే.. కొందరు ఫ్యాన్స్ మాత్రం మా హీరో / హీరోయిన్ గొప్పా అంటూ సోషల్ మీడియాలో వార్ సృష్టిస్తుంటారు.

ఫ్యాన్స్ వార్ సృష్టించడం వల్ల జరిగేదేం ఉండదు.. హీరోయిన్ల కాళ్లు మొక్కిన వైరల్ ఫొటోపై ఊర్వశి ఫైర్
X

దిశ, సినిమా: సెలబ్రిటీలకు ఫ్యాన్స్ ఉండటం చాలా కామన్. అయితే.. కొందరు ఫ్యాన్స్ మాత్రం మా హీరో / హీరోయిన్ గొప్పా అంటే మా వాళ్లు గొప్పా అంటూ సోషల్ మీడియాలో వార్ సృష్టిస్తుంటారు. తాజాగా ఇలాంటి సంఘటనే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాకు ఎదురైంది. ఏఐ ద్వారా సృష్టించిన ఓ ఫొటోలో ఐశ్వర్యరాయ్‌ను గ్లోబల్ బ్యూటీగా, ఆ తర్వాత కేటగిరిలో దీపిక పదుకొణె, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్ ఉన్నారు. ఇక వాళ్ల ముందు మోకరిల్లి పాదాలు నమస్కరిస్తున్నట్లుగా నటి ఊర్వశితో పాటు ఆలియా భట్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు. ప్రస్తుతం ఈ ఏఐ ఫొటో వైరల్ అవుతుండగా ఊర్వశి దానిపై ఘాటుగా స్పందించింది.

ఈ మేరకు తన సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ షేర్ చేస్తూ.. ‘ప్రతి నటికి తనకంటూ సొంత జర్నీ ఉంటుంది. ఆ జర్నీలో ఎంతో కష్టపడుతుంది. అలాంటి మహిళల్ని పోలుస్తూ ఫ్యాన్ వార్ సృష్టించడం వల్ల జరిగేది ఏం ఉండదు. అది కేవలం నెగిటివిటీని వ్యాప్తిచేయడం మాత్రమే అవుతుంది. దానికి బదులుగా టాలెంట్‌ను గుర్తించండి, వారి ఎదుగుదలను ప్రోత్సహించండి. దయతో ప్రవర్తించడం నేర్చుకోండి. ఇలా విషం చిమ్మడం ఆపేయండి’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె పోస్ట్ వైరల్ అవుతుండగా.. తనకు సపోర్ట్‌గా నిలిస్తూ.. ‘ఎవరి ప్రతిభ వాళ్లది.. ఎవరిని కించపరచొద్దు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story