నీ ముఖం చూసి మైమరిచిపోవాలా.. బొడ్డు చూసి పిచ్చెక్కిపోవాలా..! హీరోయిన్ వీడియోపై ట్రోలింగ్స్

by Vennela |

బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ రూపముగ్గల్ల ఏ పోస్టు పెట్టినా అది వెంటనే వైరల్‌ అయిపోతుంటుంది..

నీ ముఖం చూసి మైమరిచిపోవాలా.. బొడ్డు చూసి పిచ్చెక్కిపోవాలా..! హీరోయిన్ వీడియోపై ట్రోలింగ్స్
X

దిశ,వెబ్‌డెస్క్: బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ రూపముగ్గల్ల ఏ పోస్టు పెట్టినా అది వెంటనే వైరల్‌ అయిపోతుంటుంది. ఆమె అందానికి కుర్రకారు పిచ్చెక్కిపోతుంటారు. చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తున్న ఆమె ఫొటోకు ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ వైరల్‌గా మారింది.

కొంత మందికి ఫొటోలు చూసినా ఆగదు. పెద్ద కామ పిశాచులలాగా కామెంట్స్ పెడుతుంటారు. హీరోయిన్లు, బుల్లితెర తారలు ఏదో పబ్లిక్‌ ప్రాపర్టి అని వీళ్లు ఫీల్ అవుతుంటారు. ఎక్కువగా మగవారే చీప్‌ కామెంట్స్ పెడుతుంటారు. అది కూడా రియల్‌ అకౌంట్లు ఉండవు. ఫేక్‌ అకౌంట్ల నుంచి కామెంట్లతో కామదాహాన్ని తీర్చుకుంటారు. బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ రూపముగ్గల్ల పోస్టులకు వస్తున్న కామెంట్స్‌ చూస్తే ఈ విషయాన్ని క్లియర్‌కట్‌గా అర్థం చేసుకోవచ్చు. ఆమె ఏదైనా పోస్టు పెడితే చాలు కరువులో ఉన్నట్టు వాలిపోయి కామెంట్స్ పెడుతుంటారు. చీర కట్టులో ఎంతో అందంగా మెరిసిపోతున్న ఈ బ్యూటీ పెట్టిన ఓ ఫొటో స్టిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. అందరూ నువ్వు అందంగా ఉన్నావు లాంటి కామెంట్స్ పెడితే ఒకడు మాత్రం 'నీ ముఖం చూసి మైమరిచిపోవాలా.. బొడ్డు చూసి పిచ్చెక్కిపోవాలా..'! అంటూ కామెంట్ చేశారు. ఈ కామెంట్‌కి మిగిలిన కామెంట్స్‌ కంటే ఎక్కువగా లైక్స్‌ రావడం ఇతర మగజాతి కామంధుల పిచ్చికి పరాకష్టగా చెప్పవచ్చు.

ఇక రూప విషయానికి వస్తే ఆమె తెలుగు టెలివిజన్ రంగంలో పేరు పొందిన నటి. ఆమె తన ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. ముఖ్యంగా ఆమె పలు టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించి పేరు తెచ్చుకున్నారు. ఈటీవీలో ప్రసారమైన "అభిషేకం" సీరియల్‌లో లత పాత్రలో రూప నటించారు. ఈ సీరియల్‌లో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. స్టార్ మా ఛానల్‌లో ప్రసారమయ్యే "బ్రహ్మముడి" సీరియల్‌లో రూప స్వప్న పాత్రను పోషిస్తున్నారు. ఆమె ఈ సీరియల్‌లో కనకం, కృష్ణమూర్తి పెద్ద కుమార్తెగా కనిపిస్తారు. ఈ పాత్రతో రూపకు చాలా మంచి పేరు వచ్చింది. ఈటీవీలో ప్రసారమైన "మౌన పోరాటం" సీరియల్‌లో రూప నక్షత్ర అనే పాత్రలో నటించారు. ఈ పాత్ర కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.


రూప సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన ప్రాజెక్టుల గురించి, వ్యక్తిగత విషయాల గురించి పంచుకుంటారు. తన నటన ప్రయాణం గురించి, పరిశ్రమలో ఎదుర్కొన్న అనుభవాల గురించి ఇంటర్వ్యూలు, సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటుంటారు.

Next Story