- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయ్ దేవరకొండ ‘కింగ్‌డమ్’ నుంచి క్రేజీ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుందంటూ ట్వీట్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’.

దిశ, సినిమా: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు గౌతమ్ తిన్ననూరి(Gautam Tinnanuri) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాయి సౌజన్య, సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. అయితే ‘కింగ్‌డమ్’ (Kingdom)సినిమాకు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఫిబ్రవరి నెలలో ‘కింగ్‌డమ్’ టీజర్ విడుదల కాగా.. మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇక షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో విజయ్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజగా, ‘కింగ్‌డమ్’మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ వచ్చే వారం విడుదల కాబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన అభిమానులు ఆనందపడుతున్నారు.
#Kingdom త్వరలో ఫస్ట్ సింగిల్...
— Rajesh Manne (@rajeshmanne1) April 9, 2025
ఈ వారం అనుకున్నారు.. కానీ వచ్చే వారం ఉండొచ్చు !
A #Anirudh Musical 🎹






