Beauty: అర్జున్, అలేఖ్య మిస్సింగ్.. ఆగస్టు 23కి తెలియనున్న అసలు విషయాలు

by Chukka Sudharani |

‘ఆయ్’ ఫేమ్ అంకిత్ కొయ్య (Ankit Koya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’ (Beauty).

Beauty: అర్జున్, అలేఖ్య మిస్సింగ్.. ఆగస్టు 23కి తెలియనున్న అసలు విషయాలు
X

దిశ, సినిమా: ‘ఆయ్’ ఫేమ్ అంకిత్ కొయ్య (Ankit Koya) హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్యూటీ’ (Beauty). వర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నీలఖి హీరోయిన్‌గా నటిస్తుంది. వానరా సెల్యూలాయిడ్, మారుతీ టీం ప్రొడక్ట్, జీ స్టూడియోస్ బ్యానర్లపై అడిదాల విజయ్ పాల్ రెడ్డి, ఉమేష్ రె ఆర్ బన్సాల్ నిర్మిస్తు్న్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ (First look poster), టీజర్ (Teaser), ఫస్ట్ సింగిల్ (First single) ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనింగ్‌పై ప్రేక్షకుల్లో పాజిటివ్ అంజనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు వినూత్నంగా ఓ బస్సు వెనుక భాగంపై హీరోహీరోయిన్‌కు సంబంధించిన ఫొటోలను అంటించి.. ‘అలేఖ్య: ఏజ్ 18, అర్జున్: ఏజ్ 22’ కనిపించడం లేదు.. మరిన్ని వివరాలు ఆగస్టు 23న రాబోతున్నాయి అంటూ ప్రకటించారు. ప్రజెంట్ ఈ పోస్ట్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. లింక్


Next Story