సూర్య 46 నుంచి క్రేజీ అప్డేట్.. టైటిల్ టీజర్ లోడింగ్ అంటూ క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్..

by I. Sairam |

కోలీవుడ్ యాక్ట‌ర్‌ సూర్య(Surya) బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

సూర్య 46 నుంచి క్రేజీ అప్డేట్.. టైటిల్ టీజర్ లోడింగ్ అంటూ క్యూరియాసిటీ పెంచుతున్న పోస్ట్..
X

దిశ, వెబ్‌డెస్క్: కోలీవుడ్ యాక్ట‌ర్‌ సూర్య(Surya) బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి వెంకీ అట్లూరి(Venkey Atluri) డైరెక్ష‌న్‌లో చేస్తున్న సూర్య 46 (Suriya 46) ఒకటి. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేం మమితా బైజు(Mamitha Baiju) హీరోయిన్‌గా న‌టిస్తుండగా.. సీనియర్ నటి రవీనా టాండన్‌(Raveena Thandan) కీలక పాత్ర పోషిస్తోంది.

జీవీ ప్రకాష్ కుమార్(GV Prakash Kumar) సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ , ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై నాగ‌వంశి, సాయి సౌజ‌న్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాతో సూర్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌టంతో ఈ మూవీ పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి.

ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సూర్య 46 మూవీ నుంచి టైటిల్ టీజర్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అందులో ‘సూర్య 46 టైటిల్ టీజర్ లోడింగ్’ అంటూ సూర్య, మమిత బైజు, రవీనా టాండన్, కుక్క ఉన్న పోస్టర్ చక్కర్లు కొడుతోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే అఫీషీయల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

For Link Click

Next Story