- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బర్త్‌డే స్పెషల్ నాని న్యూ మూవీ నుంచి క్రేజీ అప్డేట్.. పోస్ట్ వైరల్
నాచురల్ స్టార్ నాని(Nani) ‘అష్టాచమ్మ’(Asta chamma) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం సాధించాడు.

దిశ, వెబ్‌డెస్క్: నాచురల్ స్టార్ నాని(Nani) ‘అష్టాచమ్మ’(Asta chamma) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ సినిమాతోనే మంచి విజయం సాధించాడు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. మెయిన్‌గా నాచురల్‌గా యాక్టింగ్ చేస్తూ ఆడియన్స్‌లో పక్కింటి అబ్బాయి అనే ప్లేస్ సంపాదించుకున్నాడు. ఓ పక్క హీరోగా మరో పక్క నిర్మాతగా ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నాడు. ఇక నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. ఇందులో భాగంగా ఆయన ప్రజెంట్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది ప్యారడైజ్’(The Paradise).
శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి(Sudhakar Cherukuri) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అన్నీ ఆకట్టుకోగా ఈ మూవీ కోసం అభిమానులు ఎగ్జైటెడ్‌గా ఎదురు చూస్తున్నారు. ఇక సినిమా తర్వాత నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు సుజిత్(Sujith)తో సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనౌన్స్మెంట్ తోనే మంచి బజ్ అందుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
అలాగే ఈ సినిమాను 2027లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేయనున్నారట. అప్పటిలోపు షూటింగ్ కూడా కంప్లీట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక ఇందులో హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) కథానాయికగా నటించనుంది. ఈ క్రమంలో ఓ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. నాని బర్త్‌డే (ఫిబ్రవరి 24న) స్పెషల్‌గా నాని-సుజిత్ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. అయితే అది కూడా ఓ వీడియో ద్వారా టైటిల్‌ను రివీల్ చేయనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






