వెంకటేష్-త్రివిక్రమ్ మూవీకు క్రేజీ టైటిల్ ఫిక్స్.. వీరిద్దరి కాంబోలో మరో హిట్ ఫిక్స్ అంటూ కామెంట్స్..

by Gugulothu.Kavitha |

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్‌లో వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)ది ఒకటి.

వెంకటేష్-త్రివిక్రమ్ మూవీకు క్రేజీ టైటిల్ ఫిక్స్.. వీరిద్దరి కాంబోలో మరో హిట్ ఫిక్స్ అంటూ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ కాంబినేషన్‌లో వెంకటేష్(Venkatesh), త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas)ది ఒకటి. ఆల్రెడీ వెంకటేష్ ప్రస్తుతం మన శంకర వరప్రసాద్‌(Mana Shankara Varaprasad)లో క్యామియో చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే వెంకీ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో మూవీ ఉంటుందని కూడా అనౌన్స్ చేసేశారు. అయితే ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు పేర్లు ప్ర‌చారం అయ్యాయి. ఇక వాటన్నింటిని ప‌టా పంచ‌లు చేస్తూ తాజాగా ఈ మూవీ టైటిల్‌ను ప్ర‌క‌టించారు మూవీటీమ్.

ఈ సినిమాకి ‘ఆద‌ర్శ కుటుంబం’(Adarsha Kutumbam) అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇక ఈ పోస్ట‌ర్‌లో రోడ్డు మీద వెంకీ ఒక చేతిలో బ్యాగ్ పట్టుకొని మరొక చేత్తో ఎవరినో నవ్వుతూ పిలుస్తున్నారు. అయితే వెంకీ వెనకాల చాలా బిల్డింగులు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ టైటిల్ లోనే హౌస్ నెం 47, ఏకే 47 అంటూ కూడా హైలెట్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ఈ రోజు నుంచే రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్న‌ట్లు చెప్పేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట‌ర్ సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్ వెంకీ-త్రివిక్రమ్ కాంబోలో మరో హిట్ ఫిక్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story