నారా రోహిత్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్.. హీరోయిన్ కూడా ఖరారు

by Pulgam srinivas |

నారా రోహిత్ నెక్స్ట్ సినిమాకు "సౌండ్ ఇంజనీర్" అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా నయన్ సారికను ఎంపిక చేసినట్లు సమాచారం.

నారా రోహిత్ కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ ఫిక్స్.. హీరోయిన్ కూడా ఖరారు
X

దిశ, వెబ్ డెస్క్: నారా రోహిత్ తాజాగా మణి కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. మణి కుమార్ ఈ సినిమాతోనే దర్శకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించబోతున్నాడు. భరత్ చౌదరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీని "NR 23" అనే వర్కింగ్ టైటిల్‌తో అధికారికంగా అనౌన్స్ చేశారు. అలాగే ఈ మూవీ షూటింగ్‌ను కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండు క్రేజీ వార్తలు వైరల్‌గా మారాయి. ఈ చిత్రానికి "సౌండ్ ఇంజనీర్" అనే టైటిల్‌ను దాదాపు ఖరారు చేసినట్లు, మరికొన్ని రోజుల్లో దానిని అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. అలాగే కొన్ని రోజుల క్రితం విడుదలైన "రాకాస" చిత్రంలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నయన్ సారిక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. "సుందరకాండ" చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నారా రోహిత్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Next Story