- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘శంబాల’ నుంచి క్రేజీ పోస్టర్ రిలీజ్.. అలాంటి లుక్‌లో హీరో దర్శనమివ్వడంతో షాక్ అవుతున్న నెటిజన్లు
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్(Adi Saikumar) నటిస్తున్న తాజా చిత్రం 'శంబాల'(Shambala).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్(Adi Saikumar) నటిస్తున్న తాజా చిత్రం 'శంబాల'(Shambala). ఇక యుగంధర్ ముని(Yugandhar Muni) దర్శకత్వం వహిస్తున్న ఈ సూపర్ నాచురల్ హారర్ థ్రిల్లర్‌లో అర్చన అయ్యర్(Archana Ayyar), స్వాసిక్(Swashik) హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. అయితే షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్న భీమోజు, మహీధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక పోస్టర్‌లో చీకటిగా ఉన్న అడవిలో ఆది.. చేతిలో నిప్పుతో ఉన్న కర్రను పట్టుకొని దేనినో ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఇక అతని వెనకాల చాలా దూరంలో నిప్పులు అంటుకున్నట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు ఆది లుక్‌ని చూసి షాకవుతున్నారు. link






