- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవర్ ఫుల్ లుక్‌లో క్రేజీ హీరోయిన్.. సమ్మర్ స్పెషల్‌గా రాబోతున్న ‘బ్లాక్ గోల్డ్’ సినిమా
న్యూ ఇయర్ స్పెషల్‌గా మూవీ టీమ్ బ్లాక్ గోల్డ్ సినిమా థియేటర్లలో ఎప్పుడు వస్తుందో చెప్పింది.

దిశ, వెబ్‌డెస్క్: ‘భీమ్లా నాయక్’(Bhimla Nayak) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత ‘విరూపాక్ష’(Virupaksha), ‘సార్’(Sir), ‘బింబిసారా;(Bimbisara) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రజెంట్ తాను నటిస్తున్న మూవీస్‌లో ‘బ్లాక్ గోల్డ్’(Black Gold) ఒకటి. దీనికి ‘చింతకాయల రవి’ చిత్రంతో దర్శకునిగా పరిచయమైన యోగి(Yogi) చాలా విరామం తర్వాత ఈ మూవీకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇక లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ పతాకంపై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. అయితే నేడు కొత్త సంవత్సరం సందర్భంగా ఈ సినిమా నుంచి హీరోయిన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
‘బ్లాక్ గోల్డ్ బృందం తరఫున అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.. బలం, స్థితిస్థాపకత మరియు ధైర్యం యొక్క శక్తివంతమైన కథ ఈ వేసవి 2026 థియేటర్లలో వేచి ఉంది’ అంటూ ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కానున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక పోస్టర్‌లో సంయుక్త మీనన్ మొహం మీద గాయంతో చేతిలో రివాల్వర్ పట్టుకొని సీరియస్‌గా చూస్తుంది. ఇక ఈ పోస్టర్ మీద బ్లడీ హ్యాపీ న్యూయర్ అని రెడ్ కలర్‌తో రాసి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






