- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇటుకలు మోస్తూ దీనస్థితిలో క్రేజీ హీరోయిన్.. అయ్యో పాపం అంటున్న నెటిజన్లు
బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య థెరా

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సత్య దేవరాజన్(Sathya devarajan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ ఎన్నో సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అలాగే అందం, అభినయంతో ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం వరుస సీరియల్స్ చేస్తూ అలరిస్తు ఉంది. ఈ క్రమంలో ఈ చిన్నదికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది.
అందులో సెట్‌లో తాను భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేసేందుకు రెడీ అవుతున్న వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబధించిన వీడియో సోషల్ మీడియ(Social Media)లో వైరల్‌గా మారగా.. నెటిజన్లు అయ్యో పాపం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా తమిళంలో ప్రసారమయ్యే ‘ధనం’(Dhanam) సీరియల్‌లో తన భర్త ఆటో నడిపిస్తాడు. అయితే తన భర్త సడెన్‌గా మరణించడంతో కుటుంబ బాధ్యతలు తీసుకుంటుంది సత్య. ఇందులో భాగంగానే ఇటుకలు మోస్తూ కనిపించింది ఈ బ్యూటీ.






