క్రేజీ కాంబో.. రౌడీ హీరోకు జోడీగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. హైప్ పెంచుతున్న ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-28 09:01:26  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ ఓ నాలుగు భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తున్నారు.

క్రేజీ కాంబో.. రౌడీ హీరోకు జోడీగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. హైప్ పెంచుతున్న ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) వరుస ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విజయ్ ఓ నాలుగు భారీ బడ్జెట్‌ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఒకటి ‘రౌడీ జనార్థన్’ (Rowdy Janardhan)పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాకు ‘రాజావారు రాణిగారు’ పేమ్ రవికిరణ్ కోలా(Ravi Kiran Kola) దర్శకత్వం వహిస్తున్నారు. దీనికి దిల్ రాజు (dil raju) నిర్మాతగా వ్యవహరిన్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూట్ మొదలు కానప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ మూవీలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇందులో మహానటి కీర్తి సురేష్(Keerthy Suresh) రౌడీ హీరోకు జోడీగా నటించబోతున్నట్లు టాక్.

ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. కాగా, కీర్తి సురేష్ ఇటీవల పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె నటించిన ‘బేబీ జాన్’ (Baby John)బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ కీర్తి సురేష్ పెళ్లి తర్వాత నుంచి ఫుల్ ఫామ్‌లో ఉంది. వేణు యెల్దండి(Venu Yeldandi), నితిన్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఎల్లమ్మ’ సినిమాలో కూడా కీర్తి హీరోయిన్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో సాయిపల్లవిని అడగ్గా డేట్స్ కుదరక పోవడంతో కీర్తి సురేష్‌ను ఓకే చేసినట్లు టాక్. ఈ రెండు ప్రాజెక్ట్స్‌తో పాటు మహానటి సుహాస్‌తో ‘ఉప్పు కప్పురంబు’ మూవీ చేస్తోంది. వరుస సినిమాలతో ఎంత బీజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు క్రేజీ కాంబో అదిరిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.

Also Read..

నువ్వే నా జీవితం అంటూ అతనితో క్యూట్ ఫొటో షేర్ చేసిన శ్రీలీల.. ఓ మై గాడ్ అది అస్సలు ఊహించలేదు అని అంటున్న నెటిజ...



Next Story