నా వాడంటే నా వాడని ఆ హీరో కోసం పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్న హీరోయిన్లు.. నెట్టింట సెన్సేషనల్‌గా మారిన వీడియో

by Gugulothu.Kavitha |   (  Updated:2025-04-28 09:33:13  IST  )

టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), కార్తీక్ రాజు(Karthik Raju) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’(Single).

నా వాడంటే నా వాడని ఆ హీరో కోసం పొట్టు పొట్టుగా కొట్టుకుంటున్న హీరోయిన్లు.. నెట్టింట సెన్సేషనల్‌గా మారిన వీడియో
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు (Sree Vishnu), కార్తీక్ రాజు (Karthik Raju) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సింగిల్’(Single). అయితే దీన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, కళ్యా ఫిల్మ్స్ పై విద్యా కొప్పినీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీస్ ఇవానా(Ivana), కేతిక శర్మ (Kethika Sharma)లు హీరోయిన్లుగా నటిస్తుండగా.. వెన్నెల కిశోర్ (Vennela Kishore) కీ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar) సంగీతం అందిస్తున్నారు.

కాగా ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మే 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస అప్డేట్ ఇస్తూ మూవీపై మరింత హైప్ పెంచుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వీడియో వైరల్ అవుతోంది. అందులో కేతిక శర్మ.. విజయ్ నా వాడు అని ఓ పేపర్ చూపిస్తుంది. అప్పుడు యంగ్ బ్యూటీ ఇవానా ఆ చిట్టిని తీసుకుని ఉఫ్ అని దానిమీద ఉన్న డస్ట్‌ను దులిపేసి ఆ పేపర్‌ను పట్టుకుని పోతుంది. ఇక ఫైనల్‌గా ట్రైలర్ ఈరోజు మధ్యాహ్నం 3.30 నిమిషాలకురానున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Click Here For Tweet...

Next Story