- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్న టాలీవుడ్ క్రేజీ బ్యూటీలు
భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీల, కృతి శెట్టి, నిధి అగర్వాల్ ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లు కోలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేయడం, అలాగే తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజ్ సంపాదించిన బ్యూటీలు టాలీవుడ్‌లో అవకాశాలు అందుకోవడం చాలా కాలంగా కొనసాగుతోంది. ఇక ఇటీవల తెలుగు సినిమాల ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న కొంతమంది హీరోయిన్లు కోలీవుడ్‌పై ఫోకస్ పెడుతున్నారు. వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
భాగ్యశ్రీ బోర్సే
'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తాజాగా ఈ బ్యూటీ శివ కార్తికేయన్ సినిమాలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే తమిళంలో కూడా ఈమెకు మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది.
శ్రీలీల
టాలీవుడ్‌లో అనేక మంది స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా హీరో ధనుష్ నటిస్తున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
కృతి శెట్టి
'ఉప్పెన', 'శ్యామ్ సింగరాయ్', 'బంగార్రాజు' చిత్రాలతో వరుస విజయాలు అందుకొని టాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ నటి ప్రస్తుతం తమిళ సినిమాలపై ఆసక్తి చూపుతోంది. ఇప్పటికే కార్తీ హీరోగా రూపొందిన 'వా వాతియార్' చిత్రంతో తమిళ ప్రేక్షకులను పలకరించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.
నిధి అగర్వాల్
టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన నిధి అగర్వాల్‌కు 'ఇస్మార్ట్ శంకర్' తర్వాత పెద్దగా విజయాలు దక్కలేదు. అయినప్పటికీ తెలుగులో ఈమెకు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కోలీవుడ్‌లో అవకాశాలు అందుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
ఇలా ఈ యంగ్ బ్యూటీలు ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.






