BIGG BOSS: బిగ్ బాస్‌కు షాక్ ఇచ్చిన సీపీఐ నారాయణ..నాగార్జునకు హైకోర్టు నోటీసులు

by Ajay Maddhiboyina |

బిగ్ బాస్ రియాలిటీ షోపై సీపీఐ నేత నారాయ‌ణ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బిగ్ బాస్ పై మొద‌టి నుండి తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు.

BIGG BOSS: బిగ్ బాస్‌కు షాక్ ఇచ్చిన సీపీఐ నారాయణ..నాగార్జునకు హైకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ రియాలిటీ షోపై సీపీఐ నేత నారాయ‌ణ మ‌రోసారి తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బిగ్ బాస్ పై మొద‌టి నుండి తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. బిగ్ బాస్ స‌మాజానికి ఏ ర‌కంగానూ ఉప‌యోగం లేని షో అంటూ మండిప‌డ్డారు. బిగ్ బాస్ అశ్లీల‌త‌తో కూడుకున్న‌ది, అసాంఘీక కార్య‌క్ర‌మాల‌తో కూడుకున్న‌ద‌ని అన్నారు. అలా చెప్పినందుకు త‌న‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయ‌న్నారు. కానీ బిగ్ బాస్ లో ఉన్న నీతి ఏంటి అని ప్ర‌శ్నించారు. బిగ్ బాస్ లో వంద‌రోజుల పాటూ యువ‌తీయువ‌కులను పెద్ద‌గుహ‌లో బంధించి అన్ని ర‌కాల స‌దుపాయాలు క‌ల్పిస్తార‌న్నారు.

అందులో అక్కా చెల్లెల్లు, ముస‌లివాళ్ల‌ను వేయ‌ర‌ని, కేవ‌లం యువ‌తీయువ‌కుల‌నే పంపిస్తార‌ని అన్నారు. అన్ని ర‌కాల స‌దుపాయాలు క‌ల్పించి యువ‌తీ యువ‌కులను గుహ‌లో వ‌దిలేస్తే ఏం చేయ‌కుండా ఉంటారా అని ప్ర‌శ్నించారు. వంద రోజుల పాటూ గుహ‌లో ఏం చేస్తున్నార‌నే చ‌ర్చ వ‌స్తుంద‌ని అన్నారు. ఇలా చెడుతో కూడిన సంస్కృతికి ఎందుకు డ‌బ్బులు పెట్టాల‌ని అన్నారు. ఇప్ప‌టికే ప‌లుమార్లు బిగ్‌బాస్‌ను బ్యాన్ చేయాలని పోలీసులు మొదలుకొని, జిల్లా కోర్టు వరకు తిరిగాన‌ని చెప్పారు. ఎట్టకేలకు హైకోర్టు స్పందించి పిటిషన్‌ను స్వీకరించిందని అన్నారు. నాగార్జునకు, బిగ్‌బాస్ నిర్వాహకులకు కోర్టు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. ఇప్పుడు తనకు సంతోషంగా ఉందని అన్నారు. తన కష్టం ఫలించిందని చెప్పారు.

Next Story