Court Movie Actress Sridevi: చీరకట్టులో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న శ్రీదేవి

by Pulgam srinivas |   (  Updated:2026-02-27 10:27:57  IST  )

Court Movie Actress Sridevi: చీరకట్టులో మెరిసిపోతున్న శ్రీదేవి. ఫోటోలు వైరల్.

Court Movie Actress Sridevi: చీరకట్టులో కుందనపు బొమ్మలా మెరిసిపోతున్న శ్రీదేవి
X

దిశ, వెబ్ డెస్క్ : నటించిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని, గుర్తింపును దక్కించుకున్న అతికొద్ది మంది నటీమణులలో శ్రీదేవి ఒకరు. ఈమె నాని నిర్మించిన 'కోర్టు' అనే చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం, ఇందులో శ్రీదేవి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

తాజాగా ఈమె 'బ్యాండ్ మేళం' అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ చిత్రాన్ని మార్చి 13వ తేదీన విడుదల చేయనున్నారు. ఇందులో 'కోర్టు' సినిమాలో నటించిన హర్ష హీరోగా నటించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ ముద్దుగుమ్మ పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తుంది. ఇప్పటికే ఇందులో నుండి కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు.

అవి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. రెండు పాటలను విడుదల చేయగా అవి కూడా పాపులర్ అయ్యాయి. 'బ్యాండ్ మేళం' కూడా మంచి విజయం సాధిస్తే ఈ యంగ్ హీరోయిన్ క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. శ్రీదేవి సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ వస్తుంది.

దానితో ఈమెకు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. తాజాగా ఈ యువ నటికి సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్గా మారాయి. అందులో ఈమె చీర కట్టుకొని ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇందులో ఈమె చాలా అందంగా ఉండడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Next Story